తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 04 2024, 16:52

వైకాపా చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు: భువనేశ్వరి

కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు..

వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఆమె కడపలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 04 2024, 16:51

టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబూ?: సీఎం జగన్‌

తిరుపతి : చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్‌ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు..

గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

"ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్‌ నిలదీశారు.

"వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 04 2024, 16:49

Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది..

ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.

మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ.. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది. దీంతో సీబీఐ సైతం సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.

కాగా, విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు ప్రాణాహనీ ఉందని దస్తగిరి భార్య, దస్తగిరి ఇద్దరూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై ఇంకా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన హైకోర్టు.. విట్‌నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుంటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 02 2024, 15:49

ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నమూత

తెలుగు, తమిళ్ సినీ పరి శ్రమలో విషాదం చోటుచేసు కుంది.ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ దవా ఖానలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఆయన మొత్తం 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు. వాటిల్లో ముంబై, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

వయోసంబంధిత సమస్య లతో సినీపరిశ్రమకు దూ రంగా ఉంటున్న ఆయన చివరిసారిగా రజనీకాంత్‌ నటించిన దర్బార్‌ సినిమా కు డైలాగ్స్‌ రాశారు.

రామకృష్ణ మృతిపట్ల సింగర్‌ మనోతోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 02 2024, 15:47

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావో యిస్టులు తారసపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 16:31

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా: బాబు మోహన్

బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణ పురం నా అడ్డా అని అన్నారు.

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటి సారిగా కరుణ పురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు. వరంగల్ కి నాకు చిన్నప్పటినుండి అనుభవం ఉందన్నారు. తాను పుట్టింది వరంగల్ జిల్లాలోనే అని తెలిపారు.

తాను వరంగల్ ఎంపీ అభ్యర్థి గా ప్రజా శాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా అని అన్నారు. తాను వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మారుతున్న‌ట్లు లీకులు ఇస్తూ చీప్ రాజ కీయలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టిన వరంగల్ లో శెభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చెస్తా అన్నారు.

వరంగల్ ప్రజలు త‌న‌న్ను గెలిపించాలని, మంచి చేయాలనీ ఉద్దెశంతో పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ లాగా కే.ఎల్. పాల్ కూడా అబద్ధాలు చెప్పరని అన్నారు.

ఉచిత విద్యా, ఉచిత వైద్యం తాను గెలిచాక ఇప్పిస్తా అన్నారు. పేద వారికి అందరికీ ఉచిత పింఛన్లు అందిస్తాన‌న్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:20

రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని తెలం గాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం దర్శించుకున్నారు.

మంత్రి కొండా సురేఖకు ఆల య అర్చక బృందం, అధికా రులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు వేములవాడ శాసనసభ్యు లు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు రాజన్నకు కోడే మొక్కు చెల్లించుకుని గర్భ గుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు.

ఆలయ అర్చక బృందం సురేఖ కు, కుటుంబ సభ్యు లకు ఆశీర్వచనం గావించా రు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యుల తో పాటు స్థానిక శాసనస భ్యులు ఆది శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లకు స్వామి వారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరిం చారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:05

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్న స్ట్రాంగ్ రూం లను సోమ‌వారం ఉదయం జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు.

సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నియోజక వర్గం లోని గ్రామీణ ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ను పెంచారు.

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చెన్నూర్, కోటపెల్లి మండలంలోని హైవే పై ప్రతినిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:03

భువనగిరి జిల్లా నారాయణపురం ఎంపీపీ ఉమాదేవి పైన అవిశ్వాస తీర్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై సోమవారం నిర్వహించ నున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా అనే ఉత్కంఠ కొనసాగు తుంది.

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 మంది ఎంపీటీసీలు రాతపూర్వకంగా గత సంవత్సరం చౌటుప్పల్ ఆర్డీవోకు ఎంపీపీపై అవిశ్వాసానికి ఫిర్యాదు చేశారు.

అప్పట్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి కోర్టును ఆశ్ర యించగా స్టే విధించడంతో అవిశ్వాసం ఆగిపోయింది. సొంత పార్టీకి చెందిన బీఆర్ ఎస్ ఎంపీపీపైనే అవిశ్వాసా నికి ఫిర్యాదు చేయడం వెనుక పార్టీ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రోత్బలంతోనే జరిగిందని ఎంపీపీ ఆరోపించారు.

ఎంపీపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తార స్థాయికి చేరడంతో బీఆర్ ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్తా ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అవిశ్వాసంపై ఉమాదేవి తెచ్చుకున్న స్టే ఎత్తివేయడం తో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి అవిశ్వాసానికి నోటీసు లు జారీ చేశారు.దీంతో ఏప్రిల్ 1న అధికారులు అవిశ్వాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో బీఆర్ ఎస్ 9, సిపిఎం 2, సిపిఐ, కాంగ్రెస్ చెరొక స్థానాల్లో గెలువగా బీఆర్ ఎస్ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్త ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరగా కాంగ్రెస్ నుండి గెలుపొందిన రాచ కొండ ఎంపీటీసీ శివరాత్రి కవిత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అదేవిదంగా అవిశ్వాసంలో సిపిఎం తటస్థ వైఖరి అవ లంబిస్తుందని అధిష్టానం ప్రకటించగా సిపిఎంకు చెందిన ఎంపీటీసీ దోడ వినోద్ రెడ్డి ఇటీవలే మృతి చెందారు. ప్రస్తుతం 12 మంది ఎంపీటీసీలకు గాను కోరం సభ్యులు హాజరైతేనే అవిశ్వాసాన్ని నిర్వహిస్తారు.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు క్యాంపులకు వెళ్లగా ప్రస్తుతం అధికార పార్టీ వైపు ఉన్న ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గు తుందా లేక వీగు తుందా?అనే ఉత్కంఠ ప్రజలందరిలో నెలకొంది.

ఇదివరకే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు కూడా జరిగిందని క్యాంపులో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎంపీ టీసీలు తమకే అనుకూలం గా ఉన్నారని కాంగ్రెస్ నేత లు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా మరో రెండు మూడు గంటల్లో ఎంపీపీపై అవిశ్వాస ఉత్కంఠకు తెరపడనుంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:02

నేడు నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు.

పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు.

జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆయన హాజరుకాను న్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై నేతలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు.